వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ పిటిషన్ కొట్టివేత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది ఈ హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ పిటీషన్ వేసింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారించిన హైకోర్టు సీబీఐ పిటీషన్ ను కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ1గా నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ షరతులు ఉల్లంఘించాడా? సాక్షులను బెదిరించాడా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని కోర్టు ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ ఆధారాలు చూపకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)