మణిపూర్‌లో రెండో దశ పోలింగ్‌ హింసాత్మకం

Telugu Lo Computer
0


మణిపూర్‌లో రెండు దశలకుగాను ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగియగా ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతున్నది. అయితే పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చోట్ల ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలయ్యాయి. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను ఇప్పటికే 38 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరిగింది. ఇవాళ 22 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 92 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో దశ పోలింగ్ కోసం అధికారులు మొత్తం 1247 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 22 స్థానాల్లో అధికార బీజేపీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ 18 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 11 స్థానాల్లో, జేడీయూ-నాగా పీపుల్స్ ఫ్రంట్ కూటమి 10 స్థానాల్లో పోటీపడుతున్నాయి. స్వతంత్య్ర అభ్యర్థులు 12 స్థానాల్లో బరిలో దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)