బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు!

Telugu Lo Computer
0

 


శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు. అద్భుతమైన బౌలింగ్‌తో 5 వికెట్ల ఘనతను సాధించాడు. తొలి రోజు ఆటలో మూడు వికెట్లు తీసిన బుమ్రా రెండో రోజు ఆట ప్రారంభంలోనే మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో డే/నైట్ టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. బుమ్రా కన్నా ముందు ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ ఈ ఘనతను అందుకున్నారు. 84/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక బుమ్రా ధాటికి 109 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లసిత్ ఎంబుల్దెనియా(1)ను షార్ట్ పిచ్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత క్రీజులో సెట్ అయిన నిరోషన్ డిక్‌వెల్లా (38 బంతుల్లో 3 ఫోర్లతో 21) కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. దాంతో ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్న బుమ్రాకు కెరీర్‌లో ఇది 8వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇక భారత గడ్డపై మాత్రం ఇదే తొలిసారి. 10 ఓవర్లలోనే బుమ్రా ఈ ఘనతను అందుకోవడం మరో విశేషం. ఇందులో 4 ఓవర్లు మెయిడిన్ చేసిన బుమ్రా కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏంటే దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ బుమ్రాలానే తన 29వ టెస్ట్‌ల్లోనే 8 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శన ద్వారా బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. తాజా ప్రదర్శనతో కలిసి టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 120 వికెట్లు తీసిన బుమ్రా.. వన్డేల్లో 113, టీ20ల్లో 67 వికెట్లు తీసాడు. శ్రీలంక జట్టుపై భారత పేసర్లలో బుమ్రా( 5/24)దే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. భారత వైస్ కెప్టెన్‌గా ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్ కూడా బుమ్రానే.

Post a Comment

0Comments

Post a Comment (0)