రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్!

Telugu Lo Computer
0


టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం హిట్‌మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి చేసిన పలు ట్వీట్లు అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. 'నాకు కాయిన్ టాస్‌లు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులో చేరినప్పుడు' అని ఓ ట్వీట్ వచ్చింది. కాసేపటికి, 'మీకు తెలుసా.. సందడి చేసే తేనేటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగ్స్‌ను కలిగి ఉంటాయి' అని మరో ట్వీట్. ఆ తర్వాత, 'క్రికెట్ బంతుల తినొచ్చు. నిజమేనా?' అని ఇంకో ట్వీట్ వచ్చింది. ఎప్పుడూ లేనిది రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి ఇలాంటి ట్వీట్లు రావడంతో అతని అకౌంట్ హ్యాక్ అయినట్లు అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు. పలువురు రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, దీనిపై హిట్‌మ్యాన్ ఇంకా స్పందించలేదు. కాగా, రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతాకు 20.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)