కృష్ణంరాజుకు ఆపరేషన్‌ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 7 March 2022

కృష్ణంరాజుకు ఆపరేషన్‌


ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజుకి ఆపరేషన్ జరిగింది. ఇటీవల ఆయన కాలుజారి పడ్డారు. దాంతో చిన్న సర్జరీ అవసరమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ పూర్తయ్యింది. ఆయన డిశ్చార్జీ కూడా ఆయ్యారు. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సివచ్చిందని సమాచారం. ప్రస్తుతం కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో `రాధే శ్యామ్‌` తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా పోషించారు. ఈనెల 11న రాధే శ్యామ్ విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో తాను కూడా పాల్గొనాలని కృష్ణంరాజు భావించారు. కానీ. ఆరోగ్యం సహకరించలేదు. సినిమా విడుదలైన తరవాత ఆయన మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది.


No comments:

Post a Comment