కర్ణాటక ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 March 2022

కర్ణాటక ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు


కర్ణాటక రాష్ట్రంలో 18మంది ప్రభుత్వ అవినీతి అధికారులపై బుధవారం అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. 100 మంది ఏసీబీ అధికారులు, మరో 300మంది అదనపు సిబ్బందితో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని 75 ప్రాంతాల్లో దాడులు చేశారు. సంపాదన కంటే అధికంగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన 18 మంది అధికారులపై దాడులు చేసిన ఏసీబీ వారి ఆస్తుల చిట్టాను పరిశీలిస్తున్నారు. బెంగళూరు ఆర్టీఓ జ్ఞనేంద్రకుమార్, బెంగళూరు టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ కుమార్ యాద్గిర్ జిల్లా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రమేష్ కంకట్టే, గోకాక్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవరాజ్ శేఖర్ రెడ్డి పాటిల్, గద్గగ్ డీసీ బసవకుమార్, విజయపుర నిర్మితకేంద్ర ప్రాజెక్టు మేనేజర్ గోపినాథ్, బదామీ ఆర్ఎఫ్ఓ శివానంద్, రాంనగర్ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్, దావణగెరె జిల్లా పర్యావరణ అధికారి మహేశ్వరప్ప, హవేరీ మార్కెట్ కమిటీ అధికారి కృష్ణన్, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ చలువరాజ్, జాతీయ రహదారుల విభాగం ఏఈ గిరీష్, పోలీసు ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, పబ్లిక్ వర్క్స్ అధికారి గవిరంగప్ప, రాయచూర్ జల నిగం అధికారి అశోక్ రెడ్డి పాటిల్, దక్షిణ కన్నడ విద్యుత్ అధికారి దయా సుందర్ రాజుల ఇళ్లు, వారి కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది.ఏసీబీ దాడుల సందర్భంగా బదామీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో 3కిలోల గంధపు చెక్కలు లభించాయి. 18 మంది అధికారుల ఆస్తులు వారి సంపాదన కంటే అధికంగా ఉన్నాయని ఏసీబీ అధికారులు చెప్పారు. 

No comments:

Post a Comment