జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం

Telugu Lo Computer
0


చెన్నై వలసరవాక్కంలో నివసించే జూనియర్ ఆర్టిస్ట్ (38) భర్తనుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తోంది. సినిమాల్లో సహాయ నటిగా పని చేస్తోంది. మంగళవారం మార్చి8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటి తలుపు కొట్టారు. ఆమె ఇంటి తలుపు తీసి చూడగా ఇద్దరు వ్యక్తులు కత్తులు చూపించి ఆమె ఇంటిలోకి నెట్టుకు వచ్చారు. ఆమె మెడపై కత్తిపెట్టి ఆమె వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం, 50 వేల రూపాయల నగదు దోచుకున్నారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె వలసరవాక్కం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై రామాపురం ప్రాంతానికి చెందిన కన్నదాసన్, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ఈ పని చేసినట్లు గుర్తించారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)