తల్లీ, కూతుర్ల సజీవ దహనం! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 March 2022

తల్లీ, కూతుర్ల సజీవ దహనం!


తమిళనాడు, కోయంబత్తూరులోని ఉరుమందపాళ్యంలోని జోస్ గార్గెన్ ఏరియాలో జ్యోతిలంగం, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. జ్యోతిలింగం, విజయలక్ష్మి దంపతులు వారి ఇద్దరు కూతుర్ల ను బాగా చదివించారు. పెద్ద కూతురు అంజలి సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నది. మరో కూతురు అర్చన అకౌంటెంట్ గా పని చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో జ్యోతిలింగం చనిపోయాడు. జ్యోతిలింగం చనిపోయిన తరువాత ఆయన భార్య విజయలక్ష్మి ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చనను కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నది. ఇద్దరు కూతుర్లకు ఆమె తల్లి విజయలక్ష్మి వారి బంధువుల సహాయంతో పెళ్లి సంబంధాలు చూస్తోంది. విజయలక్ష్మి, ఆమె కూతుర్లు అంజలి, అర్చన ఇంట్లో ఉన్న సమయంలో మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విజయలక్ష్మి ఇంటికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఇంట్లోని వంట గదిలొ ఓ కూతురు, బెడ్ రూమ్ లో ఉన్న తల్లి విజయలక్ష్మి, ఆమె మరో కూతురు శవమై కనిపించారు. రెండు సంవత్సరాల క్రితం జ్యోతిలింగం భర్త, ఇప్పుడు తల్లి విజయలక్ష్మి, ఆమె ఇద్దరు కూతుర్లు అంజలి, అర్చన సజీవదహనం కావడంతో వాళ్ల బంధువులు హడలిపోయారు. ఇంట్లో ఉన్న యూపీఎస్ పేలిపోయి మంటలు వ్యాపించి తల్లీ, కూతుర్లు సజీవదహనం అయ్యారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తల్లీ కూతుర్లతో పాటు వాళ్ల ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కలు కూడా సజీవదహనం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.  

No comments:

Post a Comment