ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మన్

Telugu Lo Computer
0

 

భగవంత్ మన్ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకను ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో ముగించారు. ‘తిరుగుబాటు సుదీర్ఘకాలం ఉండాలి’ అని అర్థం వచ్చేలా నినదించారు. స్వరాజ్య యోధుడు భగత్ సింగ్ మాటల్లో ఫ్యామస్ అయిన నినాదాన్ని సీఎం పలకడం గమనార్హం. పైగా ఈ ప్రమాణ స్వీకారానికి భగత్ సింగ్ జన్మస్థలమైన నవాన్షార్ జిల్లా, ఖట్కర్ కలాన్ గ్రామాన్ని ఎంచుకున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత భగవంత్ మన్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇదే చెప్తున్నా. అహంకారం అస్సలు చూపించకండి. మనకు ఓటు వేయని వారిపైనా కూడా గౌరవం చూపించాలన్నారు. అంతకంటే ముందు  ఉదయం 10 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర ప్రజలందర్నీ ప్రత్యేక వీడియో సందేశంలో కోరారు.  ‘ఒక్క భగవంత్‌ సింగ్‌ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లేదు.. మొత్తం 3 కోట్ల పంజాబీ ప్రజలు ముఖ్యమంత్రులు కానున్నారని ఆయన అన్నారు. అందరం కలిసికట్టుగా షహీద్‌ భగత్‌ సింగ్‌ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాల’ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)