ఫోర్త్ వేవ్ వచ్చే దాఖలాల్లేవ్!

Telugu Lo Computer
0


దేశం లో కొవిడ్ థర్డ్ వేవ్ పూర్తయిందని నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు లేవని వైరాలజిస్ట్ డాక్టర్ టీ జాకోబ్ జాన్ అంటున్నారు. ఇండియాలో కొవిడ్ దాదాపు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, మరో కొత్త వేరియంట్ రానంతవరకూ నాలుగో వేవ్ వచ్చేది లేదని స్పష్టం చేశారు. ‘నేను గతంలోనే కొవిడ్ అంతమైపోతుందని చెప్పా. దానికి నిదర్శనమే ఈ తక్కువ సంఖ్యలో కేసుల నమోదు, మైనర్ గా హాస్పిటలైజ్ అవుతున్న వారి సంఖ్య, కనీసం నాలుగు వారాల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుండటాన్ని బట్టి చూస్తే, ఇండియాలో కొవిడ్ అంతమైపోతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది’ అని అంటున్నారు డాక్టర్ జాకోబ్ జాన్. ‘ఆల్ఫా, బీటా, గామా, ఒమిక్రాన్ లు కాకుండా మరో ఇతర వేవ్ ఏదైనా వస్తే తప్ప ఇక ఏ వేవ్ ఉండదు. SARS-CoV-2 మ్యూటేషన్స్ డెవలప్ చేసుకుంటూ పోతుంది. కొన్ని మ్యూటేషన్స్ కారణంగా యాంటీజెనిక్ డ్రిఫ్ట్ డెవలప్ అవుతున్నాయి. అటువంటి చిన్న వైరస్ ల వల్లే చిన్న సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి’ అని వివరించారు. మంగళవారం 3వేల 993 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దాదాపు 662రోజుల్లో తక్కువ సంఖ్య ఇదేనని డాక్టర్ జాన్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)