లేపాక్షి - విశిష్టతలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం పలు వైవిధ్యభరితమైన కట్టడాలతో అందరిని ఆకర్షిస్తుంది. అనంతపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి గ్రామంలోని ఈ ఆలయం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అవుతుంది. ఇక్కడ వీరభ్ర స్వామి కొలువై ఉంటాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు క్రీ.శ. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ గాల్లో వేలాడే స్తంభం ఉంది. కానీ దాని గురించి ఎన్ని సర్వేలు, పరిశోధనలు చేసినా అందులోని ఆంతర్యం మాత్రం బాధపడలేదు. ఆలయంలో లేపాక్షి నంది విగ్రహం జీవం ఉన్న శిల్పంలా కనువిందు చేస్తుంది. ఆలయంలో 70 స్తంభాలు ఉన్నాయి. కానీ ఒక్క స్తంభం మాత్రమే గాల్లో వేలాడుతూ కనిపిస్తుంది. స్తంభం అడుగు భాగంలో ఖాళీ ప్రదేశమే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ స్తంభం మాత్రం కదలదు.  అక్కడికి వచ్చే భక్తులకు ఆ స్తంభం ఆకర్షణగా కనిపిస్తోంది. దీనికి ఓ కథ ప్రచారంలో ఉంది. భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ఆ గాల్లో ఉన్న స్తంభమే మిగతా వాటికి రక్షణగా ఉంటుందని ప్రతీతి. ఇంకో కధ ప్రకారం  రామాయణ కాలంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించే సమయంలో జటాయువు అడ్డు వెళితే దాన్ని తల నరికినప్పుడు ఇక్కడే పడిందని అప్పుడు శ్రీరాముడు దాన్ని లే పక్షి అని పిలిచాడని అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏదిఏమైనా స్థల పురాణ రీత్యా లేపాక్షికి ఎంతో విశిష్టత వుంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)