తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్

Telugu Lo Computer
0


తెలంగాణ బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఈరోజు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయింది. వివిధ శాఖలకు చెందని మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2022-23 బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మండలిలో కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎలా ఎదుర్కోవాలో మంత్రులకు  సీఎం కేసీఆర్ దిశానిర్థేశం చేశారు. ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త పథకాలకు శ్రీకారం చుట్టేలా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కీమ్ లకే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టి.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటంతో భారీ బడ్జెట్ నే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో కరోనా కారణంగా బడ్జెట్ అనుకున్నంతగా.. అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చలేదు. దీంతో 2022-23 తెలంగాణ ప్రవేశపెట్టే బడ్జెట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)