76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థుల తరలింపు!

Telugu Lo Computer
0


రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించామన్నారు. పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో 5300 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. స్లోవేకియా నుంచి ఆరు విమానాల్లో 1118 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించినట్టు మంత్రి వెల్లడించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయున ఏపీ విద్యార్థులను సొంత దేశానికి, ఏపీకి తరలించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి. ఇప్పటివరకు 76 విమానాల్లో 15,920 మంది భారతీయ విద్యార్థులను విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వివరించారు. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ట్వీట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)