బూస్టర్‌ డోసుతోనే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట !

Telugu Lo Computer
0


ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా కొత్త కొత్త వేరియంట్లను పుట్టుకొస్తున్నాయి. డెల్టా, ఒమిక్రాన్‌ లాంటి వైరస్‌లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ప్రస్తుతం రెండు డోసులు తీసుకుంటున్నారు. ఇక బూస్టర్‌డోస్‌ కూడా వచ్చింది. అయితే కరోనా గత వేరియంట్ల ప్రభావం నుంచి కోలుకుని రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నా ఒమిక్రాన్‌ సోకిన వారికి యాంటీబాడీల రక్షణ అంతగా ఉండదని ఓ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. అలెర్జీ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి. కేవలం మూడో డోసు తీసుకున్నవారిలో ఉత్పన్నమయ్యే యాంటీబాడీలు మాత్రమే కొంత వరకు ఒమిక్రాన్‌ను అడ్డుకుంటాయని పరిశోధకులు తేల్చారు. ఆస్ట్రేలియాలోని వియన్నా మెడికల్‌ యూనివర్సిటీ పరిశోధకులు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకుని వేరియంట్ల నుంచి కోలుకున్న కొంత మందిలోని యాంటీబాడీల స్థాయి, డెల్టా, ఒమిక్రాన్‌ తదితర వేరియంట్లపై నిరోధక శక్తిని పరిశీలించారు పరిశోధకులు. ఈ వ్యక్తుల్లోని యాంటీబాడీలు డెల్టాను అడ్డుకోగలుగుతున్నా, ఒమిక్రాన్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే మూడో డోసు తీసుకున్నవారిలో మాత్రమే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం గుర్తించినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)