ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అని నోటిఫై - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 February 2022

ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అని నోటిఫై


ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసింది. ఈ మేరకు అధికారికంగా సమాచారాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి పంపారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గౌతమ్‌రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్‌ మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా రాణిస్తున్న తరుణంలో గత సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయాల్లోకి తన వారసుడు గౌతమ్‌రెడ్డిని తీసుకొచ్చి వైసీపీ తరుపున పోటీ చేయించారు.


No comments:

Post a Comment