చర్చిల్ నగరంలో కార్లను లాక్ చేయరు!

Telugu Lo Computer
0


కెనడాలోని చర్చిల్ నగరంలో కార్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా లాక్ చేయరు. 24 గంటలు అన్‌లాక్ చేసే ఉంచుతారు. అలా ఉంచడం వలన కార్లు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే. కార్లను అన్‌లాక్ చేసి ఉంచినా అక్కడ దోపిడీకి గురికావు. అంతేకాదు, కార్లను ఇలా అన్‌లాక్ చేసి ఉంచడానికి కారణం ఉన్నది. ఆ నగరంలో దృవపు ఎలుగుబంట్ల తాకిడి అధికంగా ఉంటుంది. అవి నిత్యం జనావాసాల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తుంటాయి. మనిషి కనిపిస్తే దాడిచేసి చంపేస్తుంటాయి. ఎలుగుబంట్లు కనిపించిన సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు కార్లను ఇలా అన్‌లాక్ చేసి ఉంచుతారట. కెనడాలోని చర్చిల్ నగరానికి దృవపు ఎలుగుబంట్ల బెడద అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆహారం కోసమే ఇవి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇప్పటికే నగరంలోని ఓపెన్ ఎయిర్ డంప్‌ను మూసివేశారు. అయినప్పటికీ అవి జనావాసాల్లోకి వస్తూనే ఉన్నాయి. దీంతో చేసేదిలేక నగరవాసులు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఇలా కార్లను అన్‌లాక్ చేసి ఉంచుతారట!. 


Post a Comment

0Comments

Post a Comment (0)