కుమ్మరి దుర్గవ్వకి రెమ్యునరేషన్ పది వేలు

Telugu Lo Computer
0


భీమ్లా నాయక్ సినిమాలో అడవి తల్లి మాట అనే పాటను పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ ఇప్పుడు అందరికీ తెలుసు. ఆమెతో పాటుగా సాహితి చాగంటి ఈ పాటను పాడారు. తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఫోక్ సాంగ్ స్టయిల్‌లో ఉన్న ఈ సాంగ్‌కి శ్రోతలు ఫిదా అయిపోయారు. అయితే ఈ పాటను కేవలం నాలుగైదు నిమిషాలలోనే పాడిందట దుర్గవ్వ. ఈ పాట పాడినందుకు గాను ముందుగా ఆమెకి పది వేల రెమ్యునరేషన్ ఇచ్చారట.. ఆ తర్వాత మిగిలిన డబ్బులను తన కూతురికి ఇచ్చారని దుర్గవ్వ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, తమన్ లకి ధన్యవాదాలు చెప్పింది దుర్గవ్వ. మంచిర్యాల జిల్లాకి చెందిన ఈమె ఏం చదువుకోలేదు.. పంటపనులకి పోయినప్పుడు అక్కడే పాట పాడడం నేర్చుకుందట. అలా పాడడం అలవాటు చేసుకుంది. దుర్గవ్వ తెలుగులోనే కాదు మరాఠీ బాషలో కూడా పాటలు పాడతారు. ఇప్పటికే ఆమె పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే, సిరిసిల్లా చిన్నది మొదలుపాటలకి మంచి క్రేజ్ వచ్చింది. అలా భీమ్లానాయక్ సినిమాలో పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఇక భీమ్లానాయక్ సినిమా విషయానికి వస్తే... నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)