ఓవైసీపై దాడిని ఖండించిన యోగి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై ఛాజర్సీ టోల్‌గేట్‌ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అసదుద్దీన్‌ ఒవైసీ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. కాగా ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఒవైసీ వాహనంపై దాడి ఆమోదయోగ్యం కాదంటూ సీఎం యోగి ఈ దాడి ఘటనను ఖండించారు. అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిది, ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అసద్ కాన్వాయ్‌పై దాడిని ఖండిస్తూనే ఎన్నికల ప్రసంగాలలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు జాగ్రత్తగా ఉండాలని ఆదిత్యనాథ్ సూచించారు. యూపీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సహా పలు విషయాలపై మాట్లాడారు. ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం యూపీలో పూర్తి మెజారిటీతో గెలుస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలు, పిల్లలు, అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో 80:20 నిష్పత్తిలో సీట్లు గెలుస్తామని పేర్కొన్నారు. బీజేపీకి 80శాతం సీట్లు, ఇతర పార్టీలకు 20 శాతం సీట్లు వస్తాయన్నారు. భారతీయ జనతా పార్టీ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వానికి ఈసారి 300 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అభిప్రాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)