తమలపాకు, పచ్చకర్పూరం - ప్రయోజనాలు

Telugu Lo Computer
0



తమలపాకు, పచ్చ కర్పూరం రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఇంకా రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో లేటుగా పడుకుని ఉదయం చాలా త్వరగా లేచే వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారికి కళ్ళు తిరగడం, మలబద్ధకం, ఎసిడిటీ, వికారం, చెమటలు పట్టడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి ఒక మంచి చిట్కా ఉంది. ఒక పచ్చ కర్పూరం పలుకును పొడిగా చేసి వెన్న లేదా మంచి గంధంలో కలిపి తమలపాకులో వేసి కిళ్ళీలా చుట్టి నమలాలి. కిళ్ళీని నములుతూ ఆ ఉటను మింగుతూ ఉండాలి. ఇలా చేస్తే కళ్ళు తిరగడం, మలబద్ధకం, ఎసిడిటీ, వికారం, చెమటలు పట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలో వేడి తగ్గుతుంది. కంటి సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. కళ్లు ఎర్రబడటం., కళ్ళు దురదలు, తలనొప్పి, కళ్ల నుంచి నీరు కారటం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉండి రక్తప్రసరణ బాగా సాగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ చిట్కాను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. వేసవిలో తీసుకుంటే వడదెబ్బ, అతిదాహం, శరీరం చిటపటలాడడం, శోష వంటివి తగ్గుతాయి. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)