రష్యా బలగాలు వెనక్కి ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 February 2022

రష్యా బలగాలు వెనక్కి !


పశ్చిమ దేశాల దౌత్యం పనిచేసినట్లు అనిపిస్తోంది. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను రష్యా ఉపసంహరించింది. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధులు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై దండెత్తేందుకు సిద్దమైన రష్యా పశ్చిమ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల వద్ద లక్షలాది మంది సైనికులను రష్యా మోహరించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని దళాలను మాత్రం తమ బేస్ క్యాంపులకు పంపిస్తున్నట్లు రష్యా చెప్పింది. దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలను వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. డ్రిల్స్ పూర్తి చేసుకున్న తర్వాత తమ దళాలు కొన్ని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ మంత్రి చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సైనిక శిక్షణ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఉద్రిక్తతలను తగ్గించడంలో పశ్చిమ దేశాలు సఫలమైనట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. నాటో దళంలో చేరబోమని ఉక్రెయిన్ హామీ ఇస్తే.. ఆ దేశంపై దాడికి వెళ్లమని రష్యా ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. రష్యా విదేశాంగ ప్రతినిధి మారి జకరోవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. 2022, ఫిబ్రవరి 15వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, పశ్చిమ దేశాల యుద్ధ దుష్ ప్రచారం విఫలమైనట్లు ఆమె తన ఇన్‌స్టాలో రాశారు. పశ్చిమ దేశాలు అవమానానికి గురయ్యాయని, ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా వాళ్లు ఎత్తులు ధ్వంసం అయినట్లు ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తుందన్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా నిన్న షేర్ మార్కెట్లు డీలా పడ్డ విషయం తెలిసిందే. అయితే బెలారస్‌లో రష్యా దళాలు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. ఈ సైనిక విన్యాసాల వల్లే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. రష్యా మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. యూనియన్ రిజాల్వ్ పేరుతో బెలారస్‌లో రష్యా సైనిక శిక్షణ చేపట్టింది. తమపై రష్యా యుద్ధానికి వెళ్తుందని అమెరికా తప్పుదోవ పట్టించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. పశ్చిమ దేశాల మీడియా వైఖరిని ఉక్రెయిన్ ఖండించింది. పూర్తి స్థాయిలో రష్యా తమపై యుద్ధానికి రాబోదని ఉక్రెయిన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


No comments:

Post a Comment