భార్యను చంపి కబాబ్స్‌గా కాల్చుకు తిన్న భర్త! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 February 2022

భార్యను చంపి కబాబ్స్‌గా కాల్చుకు తిన్న భర్త!


బ్రెజిల్‌కు చెందిన మౌరో శామ్‌పెట్రి (59), క్లాడెట్ శామ్‌పెట్రి (52) భార్యాభర్తలు. చాలా కాలంగా పాటు వీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకొని ఆనందంగా ఉన్నారు. కానీ మౌరో జీవితంలోకి ఓ మహిళ రావడంతో వీరి దాంపత్య జీవితం అస్తవ్యస్తమయింది. మౌరో ప్రియురాలినే బాగా చూసుకున్నే వాడు. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. క్రమంగా తన భార్య క్లాడెట్‌ను దూరం చేసుకునే ప్రయత్నం చేశాడు. తమ ప్రేమ బంధానికి క్లాడెట్ అడ్డంగా ఉందని భావించి ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. పథకం ప్రకారమే ఆమెను దారుణంగా హత్య చేశాడు. 2017లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ మాంసాన్ని కొలిమిలో కాల్చుకొని తినేవాడు. భార్య శరీర భాగాలతో కబాబ్స్ చేసుకొని తింటూ నరమాంస భక్షకుడిగా మారిపోయాడు. భార్యను చంపిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు మౌరో. తన ప్రియురాలిని వివాహం చేసుకొని కాపురం పెట్టాడు. ఐతే క్లాడెట్ కనిపించకపోవడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఆరా తీశారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియలదని మౌరో బుకాయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ఆమె గురించి గాలించారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. చివరకు మౌరో ఇంటి ఆవరణలోనే ఎముకల అవశేషాలు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఆ ఎముకలు క్లాడెట్‌వేనని నివేదిక వచ్చింది. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారిస్తే.. అసలు నిజం బయటపడింది. తానే ఆమెను చంపినట్లు మౌరో అంగీకరించాడు. అంతేకాదు ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి నిప్పుల కొలిమిలో కాల్చుకొని తిన్నట్లు చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో పరచగా 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈకేసులో కొన్నాళ్ల పాట జైలులో ఉన్న మౌరో.. ఆ తర్వాత సిబ్బంది కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకున్నాడు. రెండో భార్యకు కూడా దూరంగా ఉంటున్నాడని.. మరో ప్రేయసిని పెళ్లి చేసుకునేందుకే జైలు నుంచి తప్పించకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత వేషం మార్చుకొని బయట తిరుగుతున్నాడు మౌరో. ఐతే ఓ రోజు రాత్రి ట్రాపిక్ పోలీసులు తనిఖీ చేస్తుండగా మౌరో దొరికాడు. తాను ఇటలీకి చెందిన వ్యక్తినని చెప్పాడు. కానీ ఎలాంటి ఐడీ కార్డు లేదు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల ప్రశ్నల వర్షం కురిపించడంతో మౌరో ఇరుక్కుపోయాడు. చేసేదేం లేక పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. జైలు నుంచి తప్పించుకున్న మౌరోను తానేనని చెప్పాడు. అలా ఐదేళ్లుగా పరారీలో ఉన్న మౌరోను పట్టుకోవడంలో పోలీసులు ఎట్టకేలకు విజయం సాధించారు. 

No comments:

Post a Comment