తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారు!

Telugu Lo Computer
0


అమెరికాలోని న్యూయార్క్‌ సమీపంలోని టియోగా కంట్రీలో కూపర్, షుల్టిస్ జూనియర్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. 2019 జులైలో తమ చిన్న పాప పైస్లీ షుల్టిస్ కనిపించకుండా పోయిందని పోలీసులకు రిపోర్ట్ చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఇటీవల సాగర్టీస్ నగరంలోని ఒక రహస్య ప్రాంతంలోని భవనంలో పైస్లీని దాచి ఉంచారనే సమాచారం పోలీసులుకు వచ్చింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి సెర్చ్ వారెంట్‌తో వెళ్లారు. భవనమంతటా గాలించినా వారికి పాప కనిపించలేదు. ఓ అధికారి అనుకోకుండా ఓ ప్రాంతంలో టార్చిలైట్ వేయడంతో రహస్య అర కనిపించింది. అక్కడ బాలిక కాళ్లు కనిపించాయి. వెళ్లి వెతికితే బాలికతో పాటు ఆమె తల్లి అక్కడ ఉన్నారు. పిల్లలను పెంచే అవకాశాన్ని తొలగిస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీంతో వారి పెద్ద పాపను పోలీసులు తీసుకుపోయారని ఎవరో వారికి చెప్పారు. దీంతో తమ చిన్న కుమార్తెను తల్లిదండ్రులే అలా దాచేసి, ఏమీ తెలియనట్లు కంప్లయింట్ ఇచ్చారు. చివరికి పోలీసులు ఆ పాపను లీగల్ కస్టోడియన్‌కు అప్పగించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)