కోడెల శివరాం అరెస్ట్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 19 February 2022

కోడెల శివరాం అరెస్ట్ !


టీడీపీ నేత కోడెల శివరాం పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్రకు బయలుదేరిన టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసుల తీరుకు నిరసనగా కోడెల శివరాం, టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేరేచర్ల – కొండమోడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చంద్రన్న ఆశయ సాధన పేరుతో కోడెల శివరాం పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. కాగా కోడెల పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. రాజుపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావుతో పాటు పలువురు పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు.

No comments:

Post a Comment