టీచర్‌తో ప్రిన్సిపాల్ రాసలీలలు! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 February 2022

టీచర్‌తో ప్రిన్సిపాల్ రాసలీలలు!


రాజస్థాన్‌లోని  జోధ్‌పూర్ రూరల్‌ లునీ ప్రాంతంలోని సలావాస్ గ్రామంలో శ్రీ అచల్‌దాస్ బగ్రేచా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఓ మహిళా టీచర్‌తో చాలా రోజులుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ఇటీవలే గ్రామస్తులకు తెలిసింది. స్కూల్ వెనకాల ఉన్న గదిలోనే ప్రిన్సిపాల్ ఒంటరిగా నివసిస్తున్నారు. ఆ గదిలోనే వీరిద్దరు తరచూ కలిసేవారు. స్కూల్ సమయంలోనూ అక్కడికి వెళ్లి రాసలీలలు జరిపేవారు. గ్రామస్తులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగే ఓ రోజు వీరిద్దరు గదిలోకి వెళ్లారు. ఏకాంతంగా ఉన్న సమయంలో గ్రామస్తులు వెళ్లి బయటి నుంచి గడియ పెట్టేశారు. అనంతరం ఊరి పెద్దలందరినీ పిలిచారు. ప్రిన్సిపాల్‌కు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్, టీచర్ ఊరు విడిచి పారిపోయారు. చివరకు వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణను లూనీ సీబీఈవోకు అప్పగించించారు. కొందరు గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మహేంద్ర బిష్ణోయ్‌కి కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిని చూసి విద్యార్థులు కూడా చెడిపోతారని, ఇలాంటి వారిని విద్యాశాఖలో లేకుండా చేయాలని కోరుతున్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడం కాదు.. ఏ స్కూల్లో పనిచేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణ తర్వాత ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రిన్సిపాల్ వాదన మరోలా ఉంది. తాను ఏ తప్పూ చేయలేదని, కొందరు తనపై కుట్ర చేశారని ఆ ప్రిన్సిపాల్ చెబుతున్నట్లు సమాచారం. స్కూల్‌లో తన గురించి అడిగితే ఎవరైనా చెబుతారని.. స్కూల్ కోసం ఎంతో చేశానని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులపై చాలా సందర్భాల్లో విమర్శలు గుప్పించానని అప్పటి నుంచి వారు తనను టార్గెట్ చేసినట్లు చెప్పారు. వారే తనపై కుట్ర చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment