ఫేస్‌బుక్‌ పై రష్యా నిషేధ ఆంక్షలు !

Telugu Lo Computer
0


సామాజిక మాధ్యమాలపై రష్యా ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్‌పై రష్యా పాక్షిక నిషేధం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత సోషల్ మీడియా కంపెనీకి అనేక రష్యన్ ప్రభుత్వ మద్దతు ఉన్న ఖాతాలకు అనుసంధానం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రాష్ట్ర వార్తా సంస్థ ఆర్ఐఏ  నోవోస్టి, రాష్ట్ర టీవీ ఛానెల్ జ్వెజ్డా, క్రెమ్లిన్ అనుకూల వార్తా సైట్‌లపై గురువారం విధించిన పరిమితులను ఎత్తివేయాలని ఫేస్‌బుక్‌కు సూచించినట్లు రష్యన్ స్టేట్ కమ్యూనికేషన్ ఏజెన్సీ రోస్కోమ్నాడ్జోర్ శుక్రవారం వెల్లడించింది. అయితే.. ఫేస్‌బుక్ మీడియా సంస్థలను పునరుద్ధరించలేదని ఏజెన్సీ స్పష్టంచేసింది. అంతర్జాతీయ మిడియా కథనాల ప్రకారం.. వ్యతిరేక కంటెంట్‌ను గుర్తించడం, ఫేస్‌బుక్ యూజర్లు సెర్స్ చేసి వాటి ఫలితాలపై సాంకేతిక పరిమితులను విధించడం వంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫేస్‌బుక్‌పై పాక్షిక నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని రోస్కోమ్నాడ్జోర్ స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనేది స్పష్టంగా చెప్పలేమని తెలిపింది. అధికారిక ప్రకటనలో.. రోస్కోమ్నాడ్జోర్ రష్యన్ మీడియాను రక్షించే చర్యగా ప్రకటించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ఫేస్‌బుక్ ప్రాథమిక మానవ హక్కులు, స్వేచ్ఛలతో పాటు రష్యన్ పౌరుల హక్కులు, స్వేచ్ఛలను ఉల్లంఘించినట్లు గుర్తించిందని పేర్కొంది. రష్యన్ మీడియా ఖాతాలను మాత్రం నిషేధించలేదని.. కానీ ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. రష్యా పొరుగున ఉన్న ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం ఇష్టం లేదన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (డిపిఆర్) ఉప విదేశాంగ మంత్రి సెర్గీ పెర్సాడా, లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పిఆర్) విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ డెనెగోతో చర్చల తర్వాత లావ్‌రోవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు ప్రారంభమైన ఒక రోజు తర్వాత, ఉక్రెయిన్‌ను ఎవరూ ఆక్రమించుకోలేని లావ్‌రోవ్ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)