సహకార బ్యాంకులను కాపాడుకోవాలి

Telugu Lo Computer
0


సహకార శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలని తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. వెసులుబాటు ఉన్నంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండని ఆదేశాలు జారీ చేశారు. బ్యాకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలన్నారు. నాణ్యమైన రుణ సదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధి చెందుతాయని డీసీసీబీలు పటిష్టంగా ఉంటే రైతులకు మేలు అని చెప్పారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లాభం పొందుతున్నాయని.. రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోందని పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలని.. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు తిప్పుకోవచ్చని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని జిల్లా, కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)