వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అలీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అలీ నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం జరిగిన  సమావేశంలో అలీని ఉద్దేశించి సీఎం జగన్.. తాను త్వరలోనే పిలుస్తాను.. శుభవార్త చెబుతానని చెప్పటంతో అలీకి ఏదో ఒక పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో ఏపీ నుంచి పార్లమెంటులో ముస్లింలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆయన్ను ఎంపీగా ఎంపిక చేస్తారన్నమాట వినిపించింది. సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా తాను చెప్పిన మాటను వారం వ్యవధిలోనే పూర్తి చేసి శుభవార్తను అధికారిక ఆదేశాల రూపంలో విడుదల చేసిన ఏపీ సర్కారు.. టాలీవుడ్ ఇష్యూల మీద ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటివరకు వెల్లడించకపోవటం విశేషం. 2019 ఎన్నికల వేళలో సినీ రంగానికి చెందిన వారు ఎవరూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకలేదు. ఇలాంటి వేళలో తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ కల్యాణ్ ను కాదని జగన్ కు అలీ భేషరతు మద్దతు ప్రకటించటం అయనకు అండగా నిలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయాన్ని సాధించినప్పటికీ.. తనకు ఎలాంటి పదవి కావాలని కోరకుండా ఉన్న ఆలీకి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు మూడేళ్ల వేళ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవిని ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)