గంగా నదిలో కోవిడ్‌ మృతదేహాలు నిజమే!

Telugu Lo Computer
0


కరోనా సెకండ్ వేవ్‌ సమయంలో గంగా నదిలో మృత దేహాలు కొట్టుకురావడం సంచలనంగా మారింది. కోవిడ్ రోగులను ఇలా నీటిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్  ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. వాటిని.. గంగానదిలో తీరంలో పూడ్చిపెట్టడంతో.. భారీ వర్షాలతో మరోసారి ఆ మృతదేహాలో గంగా నదిలో తేలుతూ విమర్శలు పాలు చేశాయి.. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజ్య సభ వరకు వెళ్లింది.. గంగా నదిలో కోవిడ్ మృతదేహాలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓ బ్రియన్.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. గంగా నదిలో ఎన్ని మృతదేహాలు కొట్టుకొచ్చాయి... వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రశ్నపై స్పందించిన కేంద్రం గంగా నదిలో మృతదేహాల మాట వాస్తమే. కానీ మృతదేహాల వివరాలు లేవని సమాధానం చెప్పింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్ గుండా ప్రవహించే గంగానదిలో గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకురావడం నిజమేనని అంగీకరించింది. వాటికి సంబంధించిన నివేదికలు అందజేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది.. కానీ, ఆ వివరాలు తమ వద్ద లేవంటూ కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, కేంద్రం సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని, అబద్ధాలు చెబుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)