40 రోజులు బంధించి అత్యాచారం చేసిన ఎస్సై

Telugu Lo Computer
0


చెన్నైలోని పళ్లికరణ కు చెందిన యువతి గతంలో మిస్ చెన్నైపోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె తల్లి తండ్రులు విదేశాల్లో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఒక ప్లాట్ ఉంది. అక్కడ ఉంటూ ఆమె సామాజిక సేవ చేస్తోంది. ఒక బిల్డర్ ఆ స్ధలంలో మంచి ఇల్లు కట్టి ఇస్తానని చెప్పి ఆమెకు చెప్పి మోసం చేశాడు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీసుస్టేషన్‌కు వెళ్ళగా అక్కడ ఆండ్రూ కాడ్వెల్ అనే స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇనస్పెక్టర్ పరిచయం అయ్యాడు. కేసు విచారణ నిమిత్తం ఆమెను పలుమార్లు కలిశాడు. కొన్నాళ్లకు విదేశాలలో ఉన్న ఆమె తల్లి తండ్రులు వృధ్ధాప్యం వల్ల, అనారోగ్యానికి గురై కన్ను మూశారు. ఈ క్రమంలో ఆ యువతి కొంత మానసిక కుంగుబాటుకు గురైంది. దీంతో ఆ యువతి తన వ్యక్తిగత విషయాలను, సమస్యలను కాడ్వెల్ తో పంచుకోసాగింది. ఈ నేపధ్యంలో కాడ్వెల్ ఆమెను లోంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించాయని త్వరలోనే వాటిని దూరం చేస్తానని ఆమెను ఓదార్చాడు. దుష్టశక్తులను తప్పించే నెపంతో అతను ఒక పాస్టర్, అతని తల్లి, సోదరిని ఆమె ఇంటికి తీసుకు వచ్చాడు. వారు రోజు ఇంట్లో పూజలు చేయసాగారు. క్రమంగా ఆమె ఇంటిలోని సహాయకులను పని మాన్పించి పంపించి వేశారు. ప్రత్యేక పూజల పేరుతో ఆమెను 40 రోజుల పాటు గదిలో బంధించారు. ఈ సమయంలో ఆమెకు మత్తు కలిపిన పానీయాలు ఇచ్చి బలహీన పరిచారు. ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు కాడ్వెల్. ఈవిషయాన్ని ఆమె అతని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయగా ..ఆమెను పెళ్లి చేసుకుంటాడని వారు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు అతను లాక్కున్నాడు. ఆమె తన ఆస్తి పత్రాలు ఇవ్వమని అడగ్గా కార్వెల్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె పళ్లికరణై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాడ్వెల్ తనను గదిలో బంధించి అత్యాచారం చేశాడని తన ఆస్తి పత్రాలు లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)