ఎల్ఐసీ పాలసీదారులకు ఐపీవోలో 10 శాతం రిజర్వ్ !

Telugu Lo Computer
0


ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపాదిత ఐపీవోలో పాల్గొనాలని భావించే పాలసీదారులు తమ పాన్ నంబర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ ఐపీవోలో 10 శాతం పాలసీ దారులకు రిజర్వ్ చేసింది. సంస్థ రికార్డుల్లో ఉన్న పాన్ నంబర్ అప్‌డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఐపీవోలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపింది. పాలసీతో పాన్‌ నంబర్‌ లింక్‌ చేసిన తర్వాత మీరు డీమ్యాట్‌ ఖాతా తెరవాలి. ఇప్పటికే ఖాతా ఉంటే కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మార్కెట్‌లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. వీటిని ఎన్ఎస్‌డీఎల్‌, సీడీఎస్ఎల్ నిర్వహిస్తుంటాయి. ఆధార్‌, పాన్‌, చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో డీమ్యాట్‌ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ డీమాట్ ఖాతా లేకపోతే వారు సొంతంగా ఖాతా తెరవాలి. ఈ డీమాట్ ఖాతా తెరవడానికి అయ్యే ఖర్చును పాలసీదారులే భరించాలని పేర్కొంది. డీమ్యాట్ ఖాతా తెరిచాక ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు అర్హులవుతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)