నడిరోడ్డుపై మహిళ హత్య ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 11 January 2022

నడిరోడ్డుపై మహిళ హత్య !


హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ లో గల నడి రోడ్డు పై ఒక మహిళపై దుండగులు కత్తీ తో దాడి చేశారు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. నడి రోడ్డు పై మహిళపై దుండగులు విచక్షణ రహితంగా కత్తి దాడి చేయడంతో చుట్టు పక్కల వాళ్లు భయంతో పరుగులెత్తారు. అయితే ఒక మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తుంది. ఆ ఒంటరి మహిళ మంగళ వారం ఎర్రగడ్డ ప్రాంతంలో రోడ్డు పై నడుచుకుంటు వెళ్తున్న క్రమంలో ఒక దుండగుడు వచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు తీవ్ర గాయాల పాలు అయిన ఒంటరి మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమె చనిపోయింది. కాగ ఆ మహిళ పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే నడి రోడ్డుపై కత్తి తో దాడి చేసిన దుండగుడు.. ఖలీల్ అనే వ్యక్తి గా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

No comments:

Post a Comment