ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య వేళల్లో ఉంటోంది. సంక్రాంతి పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు కూడా విధించకపోవడం వల్ల కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇదివరకే రాత్రిపూట కర్ఫ్యూను విధించినప్పటికీ దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్రంలో 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 26,770గా నమోదయ్యాయి. 14,510 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు-1,124, విశాఖపట్నం-1,028 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో మరే ఇతర జిల్లాలోనూ రోజువారీ కేసులు రికార్డు కాలేదు. అనంతపురం-147, తూర్పు గోదావరి-233, గుంటూరు-368, కడప-173, కృష్ణా-207, కర్నూలు-168, నెల్లూరు-253, ప్రకాశం-178, శ్రీకాకుళం-187, విజయనగరం-209, పశ్చిమ గోదావరి-95 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను విధించనుంది. మంగళవారం నుంచి ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను విధించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)