ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 819 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న14వేల 502 కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య స్వల్పంగా తగ్గింది. మరో 12మంది కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో చనిపోయారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 5వేల 716 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1988 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరు జిల్లాలో 1422, అనంతపురం జిల్లాలో 1345 కేసులు, నెల్లూరు జిల్లాలో 1305 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,955 కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,92,998గా ఉంది. గడిచిన 24 గంటల్లో 46వేల 929 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,22,34,226 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)