లగ్జరీ కారవ్యాన్‌ కొనుగోలు చేసిన నరేశ్‌

Telugu Lo Computer
0

 

సీనియర్‌ నటుడు నరేశ్‌ లగ్జరీ కారవాన్‌ని కొలుగోలు చేశాడు. ఇప్పటి వరకు అలాంటి కార్ వ్యాన్ ఏ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు లేదట. ఈ కార్ వ్యాన్ ను నరేశ్ ప్రత్యేకించి ముంబై నుండి తెప్పించుకున్నారట. ఆయన టేస్ట్ కు తగ్గట్లు డిజైన్ చేయించుకున్న దీనిలో ఏసీతో పాటు బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యాన్‌ కోసం ఆయన దాదాపు 4కోట్లు ఖర్చు చేసారని తెలుస్తుంది. ఇక ఈ లగ్జరి కార్ వ్యాన్ గురించి ఆయన మాట్లాడుతూ.."నటీనటులకు క్యారవాన్​లు అంటే మరో ఇల్లు లాంటిది. వాళ్ళ జీవితంలో దాదాపు 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటాయి. దీంతో నేను కార్ల కోసం ఖర్చుపెట్టే డబ్బు మంచి క్యారవాన్​ కొనుగోలు చేస్తే బాగుంటుందని అనుకున్నా, అలాగే కొనుకున్నా. ప్రస్తుతం మనం ఉంటున్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన క్యారవాన్​లో ఉండటం అంత సేఫ్ కాదు. దీంతో నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను" అని నరేశ్‌ చెప్పుకొచ్చారు. ఇక నరేశ్ ఇన్ని కోట్లు పెట్టి కార్ వ్యాన్ కొన్నారంటే ఆయన సంపాదన ఎంత ఉంటూందో అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)