పానీ పూరి తినటం మంచిదేనా?

Telugu Lo Computer
0


భారతీయులు ఎక్కువగా ఇష్టపడే చిరుతిండ్లలో పానీ పూరి ఒకటి. దీనిని తినేందుకు చాలా మంది అమితంగా ఇష్టపడతారు. చిన్నపాటి పూరీలను నూనెలో వేస్తే రౌండ్ బాల్స్ లా తయారు అవుతాయి. వాటిలో బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, బంగాళదుంప మసాలను మధ్యలో రంధ్రం చేసి పెడతారు. కొన్ని మసాలలతో ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న నీటిలో ముంచి ఆహారంగా తీసుకుంటారు. ఆయాప్రాంతాలను బట్టి పానీ పూరిలో వినియోగించే పదార్ధాల్లో కొంచెం తేడా ఉంటుంది. ప్రస్తుతం ఇది భారతదేశంలో ముఖ్యమైన స్ట్రీట్ ఫుడ్ గా మారిపోయింది. నగరాల్లో, పట్టణాల్లో ఏ గల్లీకి వెళ్ళినా పానీ పూరి విక్రయించే బండ్లు దర్శనమిస్తుంటాయి. సాయంత్రం వేళల్లో ఈ బండ్ల వద్ద ఎంతో హడాహుడి కనిపిస్తుంటుంది. వాటి వద్ద నిలబడి చాలా మంది పానీ పూరిలను ఇష్టంగా తింటుంటారు. ఖరీదైన కార్లలో కూడా వచ్చి బండ్ల వద్ద పానీ పూరిలను తినేవారు నగరాల్లో చాలా మంది ఉన్నారు. మరోవైపు అనేక మంది ఈ పానీ పూరిలను ఇంట్లోనే తయారు చేసుకుంటుంటారు. చిన్నారులు వీటిని తినేందుకు ఇష్టపడతుండటంతో తల్లిదండ్రులు వీటిని తయారు చేసి సాయంత్రం వేళలో చిరు తిండిగా అందిస్తున్నారు. నగరాల్లో చాలా మంది రాత్రి భోజనం చేయటం వల్ల బరువు పెరుగుతామన్న ఆలోచనతో పానీ పూరిలను లైట్ ఫుడ్ గా బావిస్తూ ఆహారంగా తీసుకుంటుంటారు. అందులోను పానీ పూరీ కాస్త స్పైసీగా, నోట్లో వేసుకుంటే అందులోని సారమంతా నాలుకకు తగిలితే ఎంతో రుచిని ఇస్తుండటంతో ఎక్కువ మంది సాయంత్రం వేళ దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. పానీ పూరీ మూలాలకు సంబంధించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. 17వ శతాబ్ధంలో షాజహాన్ చక్రవర్తి పాలన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో పానీ పూరీ తొలిసారిగా తయారైనట్లు పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ఢిల్లీలో రాజధాని నిర్మాణం జరిగాక యమునా నది నీటిలో ఆల్కలీన్ పరిమాణాన్ని సమతుల్యం చేసేందుకు కారంతో కూడిన వేయించిన స్నాక్స్ తీసుకోవాలని అప్పటి రాజ వైద్యులు ప్రజలకు సూచించారని ఆక్రమంలోనే చాట్ మసాలా, పానీ పూరి పుట్టుకొచ్చాయని మరికొందరు చెబుతుంటారు. పానీ పూరీని తినటం వల్ల కొన్ని ఆనారోగ్యాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందువలనంటే  పానీ పూరిలను నూనెలో వేయిస్తారు. ఆ పూరీల తయారీకి మైదా పిండి వినియోగిస్తారు. వీటిని వేయించేందుకు వాడే నూనెతోపాటు తయారు చేసేందుకు వాడే మైదా పిండి.. ఆరోగ్యానికి మంచిది కాదు. రోజువారి ఆహారంగా పానీ పూరిలను తీసుకోవటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. దీని వల్ల బరువు పెరుగుతారు. అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజు అదేపనిగా తినటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక బరువు , మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు పానీ పూరీలను తినకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)