బైక్‌ చక్రంలో ఇరుక్కుని ప్రాణాలొదిన పసివాడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో మూడు నెలల పసివాడు ప్రమాదవశాత్తూ బైక్‌ వెనుక చక్రంలో ఇరుక్కొని మృతి చెందాడు. బాలుడికి ట్రీట్‌మెంట్‌ కోసం బైక్‌పై హాస్పిటల్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. బాలుడికి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తూ పసికందు తల్లి చేతుల్లో నుంచి జారిపోయాడు. కింద పడిన బాలుడు బైక్ వెనుక చక్రంలో ఇరుక్కున్నాడు. మరి కాసేపట్లోనే ఇంటికి చేరుకునేవారు. ఒక్కసారిగా తల్లి ఒడి నుంచి జారి పడి బైక్‌ వీల్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పసివాడు ప్రాణాలొదిలాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)