కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయ్యరాదు?

Telugu Lo Computer
0


కనుమని పశువుల పండుగగా జరుపుకుంటారు.   పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతులకి ఆనందం. వైభవంగా ఈ పండుగను పల్లెల్లో జరుపుతారు. పశువుల పట్ల కృతజ్ఞతగా రైతులు ఈ పండుగ చేస్తారు. నదీ తీరానికి కానీ చెరువుల దగ్గరికి కానీ పశువులను తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి వాటికి అందంగా కుంకుమ అద్ది మువ్వల పట్టీలు కడతారు. అలంకరణ మొత్తం అయిపోయాక పూజ చేసి హారతి ఇస్తారు. అలానే వాటికి ఇష్టమైన ఆహారాన్ని ఇచ్చిన తర్వాత ఉత్సవంగా ఊరేగిస్తారు. గారెలు, మాంసంతో పెద్దలకి ప్రసాదాలుగా పెట్టడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనేది చూస్తే.. ఆ రోజు ఎంతో శుభకార్యం. పెద్దలను తలచుకుని మనం కూడా కాస్త కృతజ్ఞతాపూర్వకంగా నడుచుకోవాలి. అలాంటివి అన్నీ మర్చిపోయి మనం ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. అందుకనే కనుము నాడు ప్రయాణం చెయ్యొద్దన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)