హైదరాబాద్‌లో హెటిరో ఫార్మా భారీ డీల్‌

Telugu Lo Computer
0


రియల్టీ సెక్టార్‌లో దేశంలోని నాలుగు ప్రధాన నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోంది. ఇప్పటికే ఇళ్లు, కమర్షియల్‌ స్పేస్‌ విభాగంలో గణనీయమైన వృద్ధి సాధించిన నగరం తాజాగా రియల్‌ ఎస్టేట్‌ ల్యాండ్‌ డీల్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. హైదరాబాద్‌ నగరంలో మరో భారీ డీల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన హెటిరో ఫార్మా ఏకంగా 600 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ డీల్‌ కోసం హెటిరో సంస్థ రూ.350 కోట్లు వెచ్చించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఇటీవల జరిగిన డీల్‌లో హెటిరో సొంతం చేసుకున్నట్టు ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. అమెరికాకు చెందిన ఓ ఫండ్‌ సంస్థ నగరంలో రియల్టీ సెక్టార్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పటి వరకు ఈ స్థలం ఆ సంస్థ ఆధీనంలో ఉంది. కాగా తాజాగా హెటిరో సంస్థ ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఈ డీల్‌కి సీబీఆర్‌ఈ గ్రూప్‌ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ డీల్‌కి సంబంధించిన వివరాలపై హెటిరో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఫార్మాలో తిరుగులేని కంపెనీగా దూసుకుపోతున్న హెటిరో రియల్టీలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2017లో రాయదుర్గంలో 20 ఎకరాల స్థలాన్ని రూ.475 కోట్లతో కొనుగోలు చేసింది. ఇక్కడ ఆర్‌ఎంజీ, రహేజాలతో కలిసి రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు చేపడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)