ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి!

Telugu Lo Computer
0


అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఏనుగు వద్ద ఆడుకుంటూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఏనుగు పొదుగును నొక్కుతూ పాలు తాగింది. హర్షిత మావాటి కుటుంబానికి చెందిన చిన్నారి అని తెలుస్తోంది. ఆ ఏనుగును ''బిను బిను'' అని ముద్దుగా పిలుస్తూ దాని దగ్గరే ఆటలు ఆడుతోంది. ఆ చిన్నారి పాలు పిసికి తాగుతున్నా.. ఏనుగు అలా చూస్తేనే ఉంది. ఆ సమయంలో పెద్దలు కూడా ఏనుగుకు సమీపంలోనే ఉన్నారు. ఏనుగులు ఒక్కోసారి చాలా ఆగ్రహంతో ఉంటాయి. తొండంతో పట్టుకుని విసిరేయడమే కాకుండా.. కాళ్లతో తొక్కి చంపేస్తాయి. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ''లక్కీగా ఆ ఏనుగు చిన్నారిని ఏమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. దానికి చిరాకు వస్తే చిన్నారి ప్రాణాలకు హాని కలిగేది'' అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)