ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్ష పేపర్లు 7 కు కుదింపు

Telugu Lo Computer
0


ఆంద్రప్రదేశ్ లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు టెన్త్ పరీక్షలకు 11 పేపర్లు నిర్వహించగా కరోనా నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించారు. ఈ మేరకు ఆంద్రప్రదేశ్  రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సప్లమెంటరీ పరీక్షలు కూడా 7 పేపర్ల ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. సైన్స్ పేపర్‌కు రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రానికి 50 మార్కులు, బయాలజీకి 50 మార్కులు ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులకు 100 మార్కులు ఉంటాయి. కాగా, ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ కళాశాలకు సెలవులు ప్రకటించింది. సంక్రాతి సెలవుల్లో ఎవరూ స్కూళ్లు ఓపెన్ చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)