`అర్జున్ వల్ల నాకు రూ.150 కోట్లు లాస్‌`

Telugu Lo Computer
0


రమేష్ బాబు నటుడిగా ఫెయిల్ అయ్యారు. కృష్ణ వారసత్వాన్ని తాను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దానికి రకరకాల కారణాలు. అయితే నిర్మాతగా కూడా తనది లక్కీ హ్యాండ్ కాదు. అర్జున్‌, అతిథి చిత్రాలకు తానే నిర్మాత. హిందీలో సూర్యవంశ్ కూడా తీశారు. అంతే కాదు.. ఆగడు కి సమర్పకుడిగా వ్యవహరించారు. అర్జున్ యావరేజ్ గా ఆడింది. అయితే ఆర్థికంగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సివచ్చింది. అతిథి కూడా ఫ్లాపే. సూర్యవంశ్ తో నష్టాలొచ్చాయి. ఆగడు కూడా ఫ్లాపే. ఎలా చూసినా.. తనకు పెద్ద దెబ్బలే. అర్జున్ తో అయితే రూ.150 కోట్లు పోయాయని ఆయన చెప్పుకుంటారు. అదేంటి? ఆ సినిమా బడ్జెట్ అంత ఉండదు కదా..? అనిపిస్తుంది కదా. కానీ. రమేష్ బాబు దృష్టిలో అర్జున్ ద్వారా పోయింది.. 150 కోట్లు. ఎందుకంటే.. అర్జున్ సమయంలో, ఆ సినిమా నష్టాల్ని పూడ్చుకోవడానికి ఆయన హైదరాబాద్ లోని ఓ స్థలం అమ్మేశారు. అప్పట్లో ఆ స్థలం ఖరీదు 15 కోట్లు. కానీ.. కాలక్రమంలో ఆ స్థలం విలువ రూ.150 కోట్లకు చేరిందట. ఆ స్థలాన్ని చూసినప్పుడల్లా `అర్జున్ వల్ల నాకు రూ.150 కోట్లు లాస్‌` అని సన్నిహితులతో చెప్పుకునేవారని. తెలుస్తోంది. అతిథి తరవాత కూడా ఆయన సినిమాల్నినిర్మించాలనుకున్నారు. కానీ మహేష్ వద్దనడంతో ఆగిపోయారు. నటుడిగా 15 సినిమాలు చేశారు రమేష్‌. అయితే.. తను నటించిన కొన్ని సినిమాలు విడుదల కాకుండానే ఆగిపోయాయి. సాహస యాత్ర, ప్రేమ చరిత్ర, అహో విక్రమార్క, భూలోక రంభ.. చిత్రాలు విడుదలకు నోచుకోలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)