సిల్క్ స్మిత

Telugu Lo Computer
0


విజయలక్ష్మి (సిల్క్ స్మిత) 1960, డిసెంబరు 2 న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. 'స్మిత' అని తెరపేరు ధరించింది. సిల్క్ స్మిత మొదటి చిత్రము తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్ బహుళ ప్రజాదరణ పోందడంతో ఆమె తన పేరును సిల్క్ స్మిత గా మార్చుకుంది.క్రమంగా ఆమె సినీరంగలో ప్రముఖనటిగా నిలదొక్కుకుంది. 200పైగా తెలుగు తమిళ మళయాళ కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. ఉదాహరణకు తెలుగులో బావలు సయ్యా మరదలు సయ్యా పాట. కొందరు సినిమా విలేఖరులు విమర్శకులు ఆమెను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్ గా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా నర్తకిగా ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను కామోద్దీపనము కలిగించే దుస్తులతోను ముదురు అమ్మాయిలాగా కనిపించింది. అయితే సీతాకోక చిలుక (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రకలలోను మెప్పించింది. లయనం అనే పెద్దల సినిమా ఆమెకు చాలా పేరును తెచ్చింది. రేష్మా కీ జవానీ అనే పేరుతో దీనిని హిందీలో తీశారు. వసంత కోకిల చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననలు పొందింది. సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996, సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లూ చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు మద్యపానం కూడా ఆమెను నిస్పృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)