సోదరుడే కాల్చి చంపాడు !

Telugu Lo Computer
0


ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు  పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ నరేందర్‌రెడ్డి, అబ్రహాంని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో కమిషన్ ఇవ్వకపోవడంతో విజయ్ భాస్కర్‌పై కక్ష పెంచుకున్న నరేందర్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో అతను వారం క్రితం నాటు తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్‌ మీడియాకు వెల్లడించారు. టెంపుల్‌ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్‌ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్‌ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్‌ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్‌ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్‌ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. మృతదేహాన్ని కారులో పెట్టుకొని 5 గంటల పాటు తిరుమలగిరి, అల్వాల్ పరిధిలో నరేందర్‌ తిరిగాడు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన నరేందర్‌రెడ్డి.. కారులోనే మృతదేహాన్ని వదిలేసి అందులో ఉన్న రూ.9.5లక్షలను తీసుకొని పారిపోయాడు. హత్య అనంతరం విజయ్ భాస్కర్ ఫోన్, నాటు తుపాకీని కొంత దూరంలో నరేందర్‌ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయ్‌ భాస్కర్‌ ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీలో విజయ్‌ మృతదేశహం లభ్యమైంది. లభ్యమైన సాంకేతిక ఆధారాలతో నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశాం'' అని సీపీ వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)