షణ్ముగనాథన్‌ మృతి

Telugu Lo Computer
0


దివంగత డీఎంకే అధినేత కరుణానిధికి 48 ఏళ్లు వెన్నంటే ఉంటూ సేవలు అందించిన షణ్ముగనాథన్‌(80) అనారోగ్యంతో మంగళవారం చెన్నైలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం వద్ద సీఎం ఎంకే స్టాలిన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర ఉద్వేగంతో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. డీఎంకే అధినేత కరుణానిధి బతికున్నంత కాలం ఆయన వెన్నంటే షణ్ముగనాథన్‌ నడిచారు. ఎక్కడకు వెళ్లినా కరుణకు నీడగా వ్యవహరించే వారు. కరుణానిధి వెనుకే కూర్చుని ఆయన చేసే ప్రసంగాల్లో చిన్న వాఖ్యం కూడా వదలకుండా షార్ట్‌ హ్యాండ్‌ రైటింగ్‌తో రాసుకుని, వాటిని నిమిషాల వ్యవధిలో టైప్‌ చేసి మీడియాకు అందించేవారు. కరుణ మరణం తరువాత షణ్ముగనాథన్‌ వయోభారం, అనారోగ్య సమస్యలతో చెన్నై తేనాంపేటలోని ఇంటికే పరిమితం అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎండీఎంకే నేత వైగోలు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని చూసి స్టాలిన్‌ కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత కరుణానిధి నీడను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)