నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

Telugu Lo Computer
0


దేశంలో కొన్ని రోజుల కిందట కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో జీవితకాల గరిష్టానికి చేరిన ఇంధన ధరలు కాస్త తగ్గాయి. కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా కొంతమేర ధరలు తగ్గించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇటీవల ఝార్ఖండ్ ప్రభుత్వం రూ.25 మేర ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వం ధరలు తగ్గించడంతో అక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.91 కాగా... డీజిల్ ధర రూ.94.34 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 0.65 పైసలు పెరిగితే, డీజిల్‌పై 0.60 పైసల మేర పుంజుకుంది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.108.57 కాగా, డీజిల్ ధర రూ.94.95 గా ఉంది. నిజామాబాద్‌లో ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.58 పైసలు తగ్గి రూ.109.53 అయింది. డీజిల్ ధర రూ.0.54 పైసలు తగ్గడంతో రూ.95.85 అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.65 అయింది. 22 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.69కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.85 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.90 కి చేరింది. డీజిల్ ధర 0.79 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.97 అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)