ఒకే వేదికపై చంద్రబాబు- పవన్?

Telugu Lo Computer
0


తిరుపతిలో అమరావతి రైతులు తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బైపాస్ రోడ్డు మార్గంలో టయోటా షోరూం సమీపంలోని ఒక ప్రయివేటు స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు అన్నిపార్టీల ఆగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు అమరావతి రాజధానికి మద్దతుగా నిలిచిన ప్రజా సంఘాలు, ప్రముఖులు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి రైతుల తలపెట్టిన బహిరంగ సభకు తొలుత తిరుపతి పోలీసులు తిరస్కరించారు. దీంతో రైతులు ఏపీ హైర్టును ఆశ్రయించారు. కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతి ఇవ్వడంతో బహిరంగ సభకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అవసరాన్ని వివరించడానికి ఈ సభను వేదికగా చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల కల్లా సభ ముగించాలని కోర్టు ఆదేశించినందున 5 గంటలకే ముగించాలని అమరావాతి జేఏసీ భావిస్తోంది. ఈ బహిరంగ సభకు తొలి నుంచి అమరావతి రైతులకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ,కన్నా లక్ష్మీణారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శిన నారాయణ, కాంగ్రెస్ , సీపీఎం , సీపీఐ రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరరావతి సాధన కోసం రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేశారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభించి బుధవారం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగు జిల్లాల మీదుగా సుమారు 5 వందల కిలోమీటర్ల మేర వారి పాదయాత్ర సాగింది. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి పాదయాత్రను రైతులు ముగించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)