మిధాని ఫ్లై ఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 December 2021

మిధాని ఫ్లై ఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు


హైదరాబాద్ నగరంలో ఓవైసీ - మిధాని జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌కు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును నాకమరణం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది.ఈ విషయం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. డీఆర్‌డీవోలో పని చేసిన గొప్ప మనిషి అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఓ దశాబ్ద కాలం పాటు అబ్దుల్ కలాం నివాసమున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్న కలాంకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఇక ఓవైసీ – మిధాని జంక్షన్ ఫ్లై ఓవర్‌ను ఎస్ఆర్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ నిర్మించినట్లు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. ఫ్లై ఓవర్ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment