చైనాలో కుప్పకూలిన ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్

Telugu Lo Computer
0


అత్యాధునిక టెక్నాలజీతో సౌకర్యవంతంగా నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలో కీలకమైన ఫ్లైఓవర్ కుప్పకూలిన ఘటన చైనాలోని హుబే ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. హుబే ప్రావిన్స్ లో మరో ప్రధాన నగరం ఉజోలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. సిటీ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ ప్రెస్ హైవేలో కొంత భాగం కూలిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూలిన సమయంలో దానిపై మూడు ట్రక్కులు ప్రయాణిస్తున్నాయి. ఆ మూడు బ్రిడ్జితోపాటే కిందున్న రోడ్డుపై పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో కింది రోడ్డులో ప్రయాణిస్తోన్న కారు నుజ్జుయిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగించారు. చైనాలో ఎక్స్ ప్రెస్ వే నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడం, కమ్యూనిస్ట్ పార్టీకి, అధికారులకు భారీ ఎత్తున లంచాలు ముడుతుండటం వల్ల పనులు నాసిరకంగా జరిగాయనే ఆరోపపణల నడుమ తాజా ప్రమాదం సదరు చర్చకు మరింత బలం చేకూర్చినట్లయింది. అయితే, ప్రతిష్టాత్మక ఎక్స్ ప్రెస్ హైవేలో ఫ్లైఓవర్ కూలిన ఘటనపై విచారణ జరుగనుందని స్థానిక మీడియా పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)