భోజనం ముందు, తర్వాతే ట్యాబ్లేట్స్ ఎందుకు వేసుకోవాలి ?

Telugu Lo Computer
0


సాధారణంగా మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు హాస్పిటల్ కి వెళ్తే అక్కడ డాక్టర్లు పరీక్షించి మందులను ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు. కానీ కొన్ని మందులను ఇవి తినకముందు, తిన్న తర్వాత వేసుకోవాలని చెబుతారు. కొన్ని మందులు రక్తంలో కలవాల్సిన అవసరంలేకుండా, వాటిని వాడటం వల్ల మన కడుపులో ఎటువంటి సమస్య ఉండదు అన్నప్పుడు మాత్రమే భోజనానికి ముందు ఆ మందులు వాడమని డాక్టర్లు సూచిస్తారు. అయితే మరికొన్ని మందులు భోజనం తినకుండా వేసుకోవడం ద్వారా అవి రక్తంలో ప్రవేశించే వేర్వేరు ప్రక్రియలలో పాల్గొన్నప్పుడు అవి కడుపులో కొన్ని రకాల రసాయనాలను ఉత్పత్తి చేయడం ద్వారా మన కడుపులో అజీర్తి, వికారం, వాంతి వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి మందులను ఆహారం తిన్న తర్వాత వేసుకోవడం ద్వారా వాటి ప్రభావం ఆహారం మీద పడి మనకు ఎటువంటి సమస్యను కలిగించవు. అయితే కొందరు అసలు భోజనం చేయకుండా కాఫీ, టీ వంటి పానీయాలు తాగినాక వెంటనే మందులను వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. కాఫీ టీలలో ఉండే రసాయనాలతో మనం వేసుకునే మందులు ప్రతి చర్యలు జరగడంవల్ల కొత్త సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల అటువంటి ద్రావణాలలో మందులు వేసుకోకూడదు అని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే మందులను వేసుకునేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఏర్పడవని చెబుతున్నారు. కొన్ని మందులు భోజనం తిన్న తర్వాత వెంటనే వేసుకోవడం వల్ల కొందరిలో వాంతులు ఏర్పడతాయి. అందువల్ల భోజనం చేశాక 10 నిమిషాలు ఆగిన తర్వాత మందులు వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Post a Comment

0Comments

Post a Comment (0)