సుజాత

Telugu Lo Computer
0


ప్రముఖ నటి సుజాత మలయాళ నటి. ఈమె శ్రీలంకలో పుట్టి పెరిగింది. జన్మస్థలం కేరళ లోని మరదు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలన చిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. సుజాతను దాసరి నారాయణరావు గారు తెలుగులో గోరింటాకు (1979 సినిమా) చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్ర కథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా ఆధారంగా తయారయిన సంధ్య (కోదండరామిరెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీలో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. అంతులేని కథ తమిళ వెర్షన్ లో సుజాత నటించారు. గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి  చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డు అందుకున్నారు. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే తబస్విని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన అవళ్‌ ఒరు తొడర్‌ కథై (తెలుగులో అంతులేని కథ )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళిచేసుకొంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)